మూడేళ్లు లేట్ అయిన శ్రీలీల
ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుంది అమ్మడు. పెళ్లి సందడి2 సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీలీల, రెండో సినిమానే రవితేజతో చేసి ఆ సినిమా సక్సెస్ అవడంలో కీలక పాత్ర పోషించింది.
ధమాకా తర్వాత శ్రీలీలకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఫస్ట్ సినిమా పెళ్లి సందడి నిరాశపరిచినా, శ్రీలీల కు మాత్రం ఆఫర్లు బాగానే వచ్చాయి. ప్రస్తుతం రామ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నితిన్, వైష్ణవ్ తేజ్ సినిమాల్లో నటిస్తున్న శ్రీలీల చేతిలో దాదాపు 10 సినిమాలున్నాయి. అతి తక్కువ కాలంలో ఈమె స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభవిస్తుంది.
అయితే పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అరంగేట్రం మూడేళ్లు ఆలస్యంగా జరిగిందని రీసెంట్గా హీరో నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఛలో సినిమా కోసం హీరోయిన్గా శ్రీలీలను సంప్రదించినట్లు, ఆమె ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాక లాస్ట్ మినిట్ లో నో చెప్పడంతో ఆ స్థానంలోకి రష్మిక వచ్చిందని శౌర్య వెల్లడించాడు. లేటయినా సరే శ్రీలీల వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది.













