ఫ్యామిలీ స్టార్ కు మృణాల్ సెంటిమెంట్ కలిసొస్తుందా?
బాలీవుడ్ లో సక్సెస్ లేక తెలుగులో తన లక్ ను ట్రై చేయాలనుకున్న మృణాల్ ఠాకూర్ కు సీతారామం సినిమాతో మంచి క్రేజ్ ఏర్పడింది. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సీతా మహాలక్ష్మి గా మృణాల్ చేసిన నటనకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. సీతారామం తర్వాత మృణాల్ రేంజ్ మారిపోయింది.
టాలీవుడ్ నుంచి విపరీతమైన అవకాశాలొచ్చాయి కానీ అమ్మడు చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటూ వచ్చింది. సీతారామం తర్వాత మృణాల్, నానితో చేసిన హాయ్ నాన్న సినిమా కూడా అమ్మడుకు మంచి విజయాన్ని అందించింది. మృణాల్ మ్యాజిక్ హాయ్ నాన్న సినిమాకు కూడా వర్కవుట్ అయింది.
ఇక ఇప్పుడు మృణాల్ నుంచి వస్తున్న మూడో సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ మరోసారి తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెప్పించాలని చూస్తోంది. ఫ్యామిలీ స్టార్ నుంచి ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ మొత్తంలో విజయ్ దేవరకొండనే హైలైట్ అయ్యాడు. టీజర్ లో కూడా మృణాల్ ది చిన్న డైలాగ్ మాత్రమే ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్లు అందుకోవడంతో మృణాల్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో మరి ఫ్యామిలీ స్టార్ కు మృణాల్ సెంటిమెంట్ కలిసొస్తుందా లేదా అన్నది చూడాలి.













