అత్తగా స్నేహ… కోడలిగా మెహరీన్
తమిళ స్టార్ హీరో ధనుష్ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న పటాస్ మూవీ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుష్ క్లీన్‌షేవ్‌తో గాగుల్స్ పెట్టుకొని మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మూవీలో ధనుష్ డబుల్ రోల్ చేస్తున్నారు. తండ్రి కొడులుగా ధనుష్ కనిపించనున్న ఈ చిత్రంలో తండ్రి పాత్రకు హీరోయిన్గా స్నేహా నటిస్తుండగా యంగ్ క్యారెక్టర్ పక్కన మెహరీన్ హీరోయిన్గా నటిస్తోందని సమాచారం. అయితే స్నేహా, మెహరీన్ మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు అత్తా కోడలుగా నటిస్తున్నారన్నమాట. ఇటీవలే తమన్నా చెల్లిగా ఎఫ్2 చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెహరీన్ ఇప్పుడు స్నేహ కోడలిగా మరో హిట్ అందుకుంటుందేమో చూడాలి. ఆర్ఎస్ సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.













