మరో క్రేజీ కాంబోని సెట్ చేసిన ధనుష్
తమిళ హీరో ధనుష్ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకుని వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా డిఫరెంట్ కథతో రూపొందనుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ధనుష్ ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్ వినోత్ తో ధనుష్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సతురంగ వెట్టై మూవీతో డైరెక్టర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన వినోత్, కమల్ హాసన్‌తో ఓ సినిమా చేయడానికి అన్నీ సెట్ చేసుకున్నాడు.
కానీ కమల్ సినిమా స్టార్ట్ అవడానికి కాస్త టైమ్ పడుతుండటంతో ఈ లోపు ధనుష్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కోలీవుడ్ లో పలు ఆఫర్లు అందుకుంటున్న సునీల్ ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ పాత్రను పోషించనున్నాడన్నమాట.













