దేవీ ఇకనైనా జాగ్రత్త పడాల్సిందే!
రీసెంట్ గా రిలీజైన కంగువ(Kanguva) సినిమాలో కంటెంట్ తర్వాత అందరూ ఎక్కువగా కంప్లైంట్ చేసింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి. పుష్ప2(Pushpa2) బీజీఎం బాధ్యతలు తన స్థానంలో తమన్(Thaman) తో పాటూ మరో ఇద్దరికి ఇచ్చారనే వార్త వినిపిస్తున్న దగ్గర నుంచి దేవీ ఫ్యాన్స్ ఆశలన్నీ కంగువ(Kanguva)పైనే ఉన్నాయి. కానీ థియేటర్లలో కంగువ చూశాక అందరికీ లౌడ్ సౌండ్ అనే ఫీలింగొచ్చింది.
సినిమా కంటెంట్ అలాంటిది అనుకోవచ్చు కానీ చాలా వీక్ సినిమాలను కూడా దేవీ తన బీజీఎంతో నిలబెట్టిన సందర్భాలున్నాయి. దానికి తోడు కంగువ సాంగ్స్ కూడా అన్నీ ఛార్ట్ బస్టర్ కాలేదు. రీల్స్ చేసుకునే వాళ్లకు కూడా ఈ సాంగ్స్ ఏమంత సెట్ అవడం లేదు. ఈ మైనస్లకు తోడు ఇప్పుడు ఈ ఫీడ్ బ్యాక్ ఒకటి.
వాస్తవానికి కంగువ కోసం దేవీకి చాలా టైమే దొరికింది. పలుమార్లు వాయిదా పడటం వల్ల కావాల్సినంత టైముంది. అప్పుడైనా దేవీ కరెక్షన్స్ చేసుకుని ఉంటే బావుండేది. కానీ దేవీ ఆ టైమ్ లో హైదరాబాద్ లైవ్ కాన్సర్ట్ మీద ఫోకస్ పెట్టాడు. అందుకే హడావిడిగా కంగువ వర్క్స్ పూర్తి చేసినట్లు అనిపించింది. ఏదేమైనా కంగువ విషయంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను దేవీ శ్రీ కచ్ఛితంగా లెక్కలోకి తీసుకోవాల్సిందే. మంచి కంబ్యాక్ ఇస్తాడనుకున్న దేవీ ఫ్యాన్స్ కు ఈ విషయం నిరాశే మిగిల్చింది.













