మరోసారి జత కట్టనున్న చిరూ, దేవీ శ్రీ
మెగాస్టార్ చిరూ, రాక్ స్టార్ దేవీశ్రీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కలయికలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి వాల్తేరు వీరయ్య వరకు వీరి కాంబోలో వచ్చినవన్నీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అనే చెప్పాలి. అలాంటి డీఎస్పీ ప్రస్తుతం చేస్తున్న సినిమా పుష్ప2 ఒక్కటే.
ఈ నేపథ్యంలో చిరూ, దేవీలు మరోసారి కలసి పనిచేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం భోళా శంకర్ సినిమా చేస్తున్న చిరూ, ఆ తర్వాతి సినిమాను కళ్యాణ్ కృష్ణతో చేయనున్న విషయం తెలిసిందే. చిరూ బర్త్డే రోజున ఈ సినిమాను లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. చిరూ కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరూతో త్రిష జత కట్టనుంది.
ఇదే సినిమాలో చిరూ కొడుకు పాత్రలో సిద్దూ జొన్నలగడ్డ, సిద్దూకు జోడీగా శ్రీలీల నటించబోతున్నట్లు సమాచారం. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడని, దేవీ అయితేనే చిరూకు మంచి అవుట్పుట్ ఇస్తాడని డైరెక్టర్ అనుకుంటున్నట్లు టాక్. ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట మేకర్స్.













