Devara2: దేవర2 నుంచి బర్త్ డే ట్రీట్ ఉంటుందా?

మే నెల వచ్చిందంటే ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. దానికి కారణం మే నెలలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది కాబట్టి. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల్లో నుంచి పోస్టర్లు, టీజర్లు లేదా చిన్న చిన్న గ్లింప్స్ లాంటివి ఏదైనా రిలీజ్ చేస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
అందులో భాగంగానే ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి నటిస్తున్న వార్2(War2) సినిమా నుంచి ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే అఫీషియల్ గా బయటికొచ్చింది. మామూలుగా అయితే బాలీవుడ్ లో ఇలా బర్త్ డే లుక స్పెషల్ ట్రీట్స్ లాంటివి ఇవ్వడం ఏముండదు. కానీ ఎన్టీఆర్ టాలీవుడ్ వాడు కాబట్టి వార్2 టీమ్ టాలీవుడ్ పద్దతినే ఫాలో అవుతుంది.
ఇక ప్రశాంత్ నీల్(Prasanth Neel) సినిమా నుంచి ఎలాంటి గ్లింప్స్ రాదని ఇప్పటికే చెప్పేశారు. ఇక మిగిలింది దేవర2(Devara2). కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన దేవర(Devara) సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. దేవర2 కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ బర్త్ డే కు దేవర2 నుంచి ఏమైనా అప్డేట్ ఉంటుందా అని అది దాదాపు కష్టమనే చెప్పాలి. దేవర2 నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కు కేవలం పోస్టర్ మాత్రమే ఉండే ఛాన్సుందని అంటున్నారు. మరి చూడాలి దేవర2 ఎలాంటి ఫ్యాన్స్ కు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తుందో.