Devara2: దేవర2.. నో డౌట్స్..

ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత ఎన్టీఆర్(NTR) హీరోగా కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన దేవర(Devara) సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో సినిమా కావడం, ఆ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే దేవర సినిమా బాగా ఆడినప్పటికీ ఆశించిన స్థాయిలో లేదని, దీంతో దేవర2(Devara2) ఉండదని వార్తలొచ్చాయి.
కానీ ఎన్టీఆర్ మాత్రం దేవర ఉంటుంది, ఉండి తీరుతుందని స్టేజ్ పై అందరి ముందు చెప్పడంతో ఆ మధ్య దేవర2 ఆగిపోయిందని వచ్చిన వార్తలు వినిపించడం తగ్గింది. కానీ రీసెంట్ గా మళ్లీ ఎన్టీఆర్ నటించిన వార్2(war2) సినిమా డిజాస్టర్ గా నిలవడంతో మరోసారి దేవర2 సినిమా ఉండదని, ఎన్టీఆర్ తొందరపడి ఏ సినిమా పడితే అది చేయాలనుకోవడం లేదని అన్నారు.
దీంతో దేవర2 ఉంటుందా ఉండదా అనే విషయంలో అందరికీ అనుమానాలు ఎక్కువయ్యాయి. తాజా సమాచారం ప్రకారం దేవర2 ఉందని, కొరటాల శివ ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నరని, ఆల్రెడీ ఎన్టీఆర్ కు దేవర2 ఫుల్ స్క్రిప్ట్ ను కూడా కొరటాల నెరేట్ చేయగా, ఎన్టీఆర్ కు కూడా ఆ కథ బాగా నచ్చిందని అంటున్నారు. దీంతో ఇక దేవర2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజవుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.