Devara2: దేవర2 పై క్లారిటీ వచ్చేసిందిగా!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) హీరోగా కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన దేవర(Devara) సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ డివైడ్ టాక్ తో నడిచింది. రివ్యూలు కూడా మరీ పాజిటివ్ గా రాలేదు. ఎన్టీఆర్ హీరో అవడం వల్ల భారీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ లాంగ్ రన్ లో సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
అయితే దేవర సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే డైరెక్టర్ కొరటాల దీన్ని రెండు భాగాలుగా తీసుకురానున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. కానీ దేవర రిలీజ్ అయ్యాక రిజల్ట్ చూసి అందరూ దేవర2 ఉండదని ఫిక్సయ్యారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీ అవడంతో పాటూ తారక్(Tarak) లైనప్ లో కొత్త దర్శకుల పేర్లు విని దేవర2(Devara2) క్యాన్సిల్ అయిందని అంతా అనుకున్నారు.
అయితే తాజాగా అందరి అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాణ సంస్థ దేవర2 ఉంటుందని కన్ఫర్మ్ చేసింది. దేవర1 రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేవర రిజల్ట్ చూశాక కూడా దేవర2 చేస్తున్నారంటే అటు దర్శకుడికి, ఇటు హీరోతో పాటూ నిర్మాతలకు కూడా ఈ మూవీపై ఎంత నమ్మకముందనేది అర్థమవుతుంది.