సౌత్ లో డియోల్ బ్రదర్స్ హంగామా
ఉన్నట్టుండి ఫేడవుట్ అయిన హీరోలు మంచి సినిమాలను చేసి తిరిగి వారి స్టార్డమ్ ను వెనక్కి తెచ్చుకున్నారు. బాలీవుడ్ సహా కోలీవుడ్, టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు డియోల్ బ్రదర్స్. వీళ్ల పనైపోయిందనుకుంటున్న టైమ్ లో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చి వీరిద్దరూ తమ సత్తా చాటుతున్నారు.
యానిమల్ సినిమాలో అబ్రార్ గా నటించి అందరి మెప్పు పొందిన బాబీ డియోల్ కు ఆ తర్వాత అతడికి అవకాశాలొస్తున్నాయి. రీసెంట్ గా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లాంటి క్రేజీ సినిమాల్లో విలన్ గా నటిస్తున్నాడు. కోలీవుడ్ లో సూర్య నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా కంగువ లో కూడా విలన్ పాత్రలో బాబీ నటిస్తున్నాడు.
ఇలాంటి టైమ్ లోనే సన్నీ డియోల్ గదర్2 తో హిట్ కొట్టి ఇప్పుడు తెలుగులో ఓ స్ట్రయిట్ సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తెలుగు- హిందీ ద్విభాషా చిత్రం కోసం సన్నీ డియోల్ లాంటి అగ్ర హీరోని ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచింది. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో వీరిద్దరి అనుబంధం గురించి ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతుంది.













