బాబీ రేంజే మారిపోయిందిగా!
యానిమల్ సినిమాలో విలన్ గా నటించిన బాబీ డియోల్ కు సౌత్ లో చాలా డిమాండ్ ఏర్పడింది. గత కొంత కాలంగా సరైన బ్రేక్ లేకపోవడంతో ఈ సీనియర్ హీరోను బాలీవుడ్ డైరెక్టర్లు కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు దక్షిణాది డైరెక్టర్లు మాత్రం బాబీని కోరి మరీ ఎంచుకుంటున్నారు. ముందుగా తెలుగులో బాబీ సైన్ చేసిన సినిమా హరిహర వీరమల్లు.
ఆ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయ్యాక ఆగిపోవడంతో బాబీ డేట్స్ కు తిరిగి ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఇక సూర్య హీరోగా వస్తున్న కంగువా లో కూడా బాబీ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో బాబీ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమా హిట్ అయితే కోలీవుడ్ లో విలన్ గా మరిన్ని ఛాన్సులొస్తాయి.
వీటితో పాటూ బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమాలో కూడా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు ఈ సినిమాలో బాలయ్య, బాబీ డియోల్ మధ్య జరిగే సీన్స్ పీక్స్ లో ఉంటాయట. అంతే కాదు, వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర కోసం కూడా బాబీని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. డేట్స్ ఎక్కువ కావాల్సి రావడంతో బాబీ డియోల్ దగ్గర అన్ని కాల్షీట్స్ లేకపోవడంతో చెప్పలేమన్నాడని యూనిట్ నుంచి అందుతున్న టాక్. మొత్తానికి యానిమల్ సినిమాతో బాబీ డియోల్ క్రేజ్ అమాంతం పెరిగిందనే చెప్పాలి.













