83 కోసం 14 కోట్లు!
కపిల్‌దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్లు 1983లో తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకొని విశ్వ విజేతగా ఆవిర్భవించింది. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయంగా లిఖించబడ్డ నాటి మహోజ్వల ఘట్టాన్ని 83 పేరుతో వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు. కపిల్‌దేవ్ పాత్రలో రణవీర్‌సింగ్ నటిస్తున్నారు. కబీర్‌ఖాన్ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో కపిల్‌దేవ్ సతీమణి రోమీ భాటియా పాత్రలో దీపికాపదుకునే నటించబోతున్నది. రియల్‌లైఫ్ జోడీ అయిన రణవీర్-దీపికా రీల్‌లైఫ్‌లో కూడా భార్యభర్తలుగా నటించబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.త్వరలో ఈ సినిమా షూటింగ్లో దీపికాపదుకునే పాల్గొనబోతున్నది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రణవీర్‌సింగ్. భర్త రణవీర్ సింగ్ తొలిసారి నటిస్తున్న స్పోర్ట్స్‌డ్రామా కావడంతో సినిమాను అంగీకరించిందని తెలిసింది. ఇదిలావుండగా ఈ సినిమా కోసం దీపికాపదుకునే 14 కోట్ల పారితోషికం అందుకోబోతున్నదని చెబుతున్నారు. రణవీర్-దీపికాపదుకునే జోడీ వల్ల సినిమాకు వాణిజ్య పరంగా క్రేజ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉండటంతో దీపికాపదుకునే భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేశారని అంటున్నారు.













