దీపికా పదుకొనే కు కరోనా పాజిటివ్

కరోనా సెకండ్ వేవ్ సెలబిట్రీలను సైతం వణికిస్తోంది. దీంతో ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు కరోనా బారినపడ్డారు. తాజాగా అగ్ర కథానాయిక దీపికా పదుకోనే కరోనా బారినపడినట్లు తెలిసింది. అయితే ఆమె ఇప్పటి వరకు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. కానీ ఆమె ఐసోలేషన్‍లో ఉన్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం దీపికా, ఆమె భర్త రణ్వీర్‍సింగ్ బెంగళూరు వెళ్లారని, ఆ తర్వాతనే ఆమెకు పాజిటివ్ రావటం జరిగిందని తెలిసింది. ఆమెకే కాకుండా ఆమె కుటుంబానికి వైరస్ సోకినట్టు తెలిసింది. ప్రస్తుతం వారంతా ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆమె తల్లి కోలుకుని డిశ్చార్జి అయ్యింది. ఆమె తండ్రి త్వరలోనే డిశ్చార్జి కానున్నారని తెలిసింది.