చిరూ సినిమాలో దీపికా?
బింబిసారతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర (వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఇంకా హీరో చిరంజీవి సెట్స్ లోకి అడుగుపెట్టలేదు. ప్రస్తుతానికి చిరంజీవి లేని సన్నివేశాలను కానిచ్చేస్తున్నాడు డైరెక్టర్ వశిష్ట.
ఈ సినిమాలో హీరోయిన్లుగా త్రిష, మృణాల్ పేర్లు ఎంపికైనట్లు తెలుస్తోంది. కానీ ఇంకా ఇప్పటివరకు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ వార్త మెగా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఎక్కిస్తోంది. విశ్వంభరలో ఓ క్యామియో కోసం దీపికా పదుకొణెను సంప్రదించారని, కథలో భాగంగా హీరో ఓ దేవ కన్యను కలుస్తాడట.
ఆ సందర్భంగా వచ్చే స్పెషల్ సాంగ్‌ను ఓ అందాల తారతో చేయించాలని మేకర్స్ డిసైడయ్యారని, అందులో భాగంగానే దీపికాను సంప్రదించారని తెలుస్తోంది. రెమ్యూనరేషన్ ఎంతైనా సరే ఇద్దామన్న ఆలోచనలో యువి సంస్థ ఉందని సమాచారం. ఈ వార్త గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు నమ్మలేం కానీ ఇది నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు.













