మరో తెలుగు సినిమాలో దీపికా
బాలీవుడ్ హీరోయిన్లంతా ఇప్పుడు సౌత్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకుముందు సౌత్ సినిమాలను తక్కువగా చూసిన బాలీవుడ్ భామలు ఇప్పుడు ఒక్కసారిగా తమ చూపును ఇటువైపు మళ్లించారు. ఇందులో భాగంగానే జాన్వీ కపూర్ దేవర సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది పూర్తి కాకముందే బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించనున్న సినిమాకు కూడా సైన్ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ సత్తా చాటుతున్న క్రమంలో బాలీవుడ్ లో చేసిన సినిమాలు చాలులే అనుకుని తెలుగు సినిమాలు చేయాలని డిసైడైందట. ఇప్పటికే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేస్తుంది దీపికా.
ఇది కాకుండా మరో తెలుగు సినిమాను దీపికా ఓకే చేసిందని సమాచారం. ఓ స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో కాంబోలో రానున్న పాన్ ఇండియా సినిమాలో దీపికాను హీరోయిన్ గా తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయట. దాదాపు దీపికా కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు. ఈ సినిమా కోసం కూడా దీపికా బ్లాస్టింగ్ రెమ్యూనరేషన్ తీసుకోబోతుందని తెలుస్తోంది.













