దీపిక ఖాతాలో రేర్ ఫీట్
ల్కి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన దీపికా పడుకొణె తన మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. అయితే ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి కుదరని, అవకాశం లేని ఓ రేర్ ఫీట్ ను దీపిక సొంతం చేసుకోబోతుంది. దీపిక తన 18 ఏళ్ల కెరీర్లో ఎన్నో హిట్లు అందుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది దీపిక.
ఇక అసలు విషయానికొస్తే దీపికా నటించిన సినిమాల్లో హిట్ అయిన మూవీలన్నీ లెక్కలోకి తీసుకుని వాటి గ్రాస్ మొత్తం లెక్కేస్తే రూ.10 వేల కోట్లకు దగ్గరగా ఉంది. బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం కల్కి 1055 కోట్లు, పఠాన్ 1060 కోట్లు జవాన్ 1143 కోట్లు, చెన్నై ఎక్స్ప్రెస్ 422 కోట్లు, బాజీరావు మస్తానీ 367 కోట్లు, ఏ జవానీ హై దివానీ 318 కోట్లు కలెక్ట్ చేశాయి.
హాలీవుడ్ సినిమా ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ రూ.2300 కోట్లు కలెక్ట్ చేయగా మరికొన్ని సినిమాలు వంద కోట్లు దాటాయి. ఇలా అన్నీ కలుపుకుంటే ఇప్పటివరకు రూ.9808 కోట్లు అయ్యాయి. సింగం అగైన్ సినిమా వచ్చాక ఈజీగా పది వేల కోట్లు దాటేస్తుంది. ఇలాంటి మైల్ స్టోన్ ఇప్పటివరకు ఎవరికీ లేకపోవడం గమనించాల్సిన అంశం. ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న దీపిక విశ్రాంతిలో ఉంది. డెలివరీ అయ్యాక షూటింగ్స్ కు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటుంది.













