ఒక అమ్మాయి కోసం వస్తున్న ప్రేమ కథ ఇది
మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా డియర్ మేఘ. వేదాన్ష్ క్రియేటివ్ వర్కస్, బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుశాంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ఒక అబ్బాయి అమ్మాయిని డియర్ మేఘ అని పిలుస్తాడు. అలా ఎందుకు పిలుస్తాడు అనేది థియేటర్లో చూడాలి. ఇక ఈ సినిమా కథ గురించి ఎక్కువగా చెప్పాలని అనుకోవడం లేదు. బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఎమోషన్ ఫీల్ అవుతారు. ఒక అమ్మాయి కోణంలో వస్తున్న ప్రేమ కథ ఇది. మేఘ అనే అమ్మాయి టీనేజ్ నుంచి అడల్ట్ వరకు తన జీవితంలో జరిగిన లవ్ ఇన్సిడెంట్స్ ఎమోషనల్‌గా చెప్పే చిత్రమిది. అమ్మాయి కోణంలో ఒక ప్రేమ కథ తెరకెక్కించడం ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాము. డియర్ మేఘ సినిమా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ముగ్గురు లీడ్ యాక్టర్స్ మేఘ, అరుణ్, అర్జున్ సోమయాజులు పర్ఫెక్ట్గా నటించారు అని అన్నారు.













