డియర్ కామ్రేడ్ ట్రైలర్ లాంచ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం డియ్ కామ్రేడ్. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అనేది ట్యాగ్ లైన్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవశంకర, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ 26న తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడలో సినిమా విడుదల కానుంది. ఈ నెల 12న బెంగళూరులో, 13న కొచ్చిలో, 18న చెన్నైలో, 19న హైదరాబాద్‌లో మ్యూజికల్ ఫెస్టివల్ నిర్వహించనున్నాం అని అన్నారు.













