దసరా సినిమాలు పెద్దవే..!
సినిమా నిడివి అంటే మినిమం రెండున్నర గంటలనేది ఒక ముద్ర పడిపోయింది ఇండస్ట్రీలో. ఇంతకంటే ఎక్కువ ఉంటే అమ్మో ఇంత పెద్ద సినిమానా అనడం, రన్ టైమ్ అంతకంటే తక్కువ ఉంటే చిన్న సినిమా అనడం అలవాటు చేసుకున్నారు ఆడియన్స్. సోషల్ మీడియా వచ్చాక రన్ టైమ్ ఎక్కువ ఉన్న సినిమాలకు ఎడిటర్లకు కాస్త పని ఎక్కువైపోతుంది.
సాంగ్స్, అనవసర సీన్స్ తీసేసి సినిమా నిడివి మినిమం 2 గంటల నుంచి 2 గంటల 15 నిమిషాలుండేలా చూసుకుంటున్నారు. కానీ ఈ మధ్య కంటెంట్ ఉంటే రన్ టైమ్ అనేది ప్రాబ్లమ్ కాదని ఫీలవుతున్నారు ఆడియన్స్. మొన్నామధ్య పెద్ద సినిమాలుగా వచ్చిన అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి సినిమాలు మంచి హిట్ అవడంతో కంటెంట్ ఉంటే ఎంత పెద్ద సినిమా అయినా చూస్తారనే అభిప్రాయానికొచ్చారు.
ఇక అసలు విషయానికొస్తే, ఈ దసరాకు రాబోతున్న మూడు సినిమాలూ పెద్ద సినిమాలనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ టైగర్ నాగేశ్వరరావు నిడివి 3 గంటల 2 నిమిషాలుగా తెలుస్తోంది. విజయ్ లియో సినిమా 2 గంటల 40 నిమిషాలని సమాచారం. భగవంత్ కేసరి కూడా 2 గంటల 30 నిమిషాలకు పైగానే నిడివి ఉండనుందని టాక్. ఈ మూడూ సినిమాలకు కూడా టాక్ బాగుంటే రన్ టైమ్ అనేది ఇబ్బంది అనిపించదు. కానీ టాక్ తేడా వస్తే మాత్రం అంతంత రన్ టైమ్ ఉన్న సినిమాలను తట్టుకోవడం కష్టమే. మరి ఈ దసరాకు రిలీజ్ కాబోతున్న సినిమాల్లో విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.













