సాయి పల్లవిని మైమరపించేలా నాగ చైతన్య!
ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. ఆనంద్, గోదావరి, ఫిదా వంటి ప్రేమ కథా చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన సినిమాల్లోని మాటల్లోను .. పాటల్లోను సున్నితమైన భావజాలం కనపడుతుంది. ఆయన సినిమాలను కుర్రకారుతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా ఇష్టపడుతారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినిమాస్ – అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కె.నారాయణదాస్ నారంగ్ – పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందించగా, ఈ చిత్రంలోని విడుదలైన ప్రతీ పాట తెలుగు ప్రేక్షకులని కట్టి పడేసింది. ‘సారంగధరియా ..’ పాట వదిలిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ పాటలోని సాయి పల్లవి డాన్స్ స్టెప్పులకి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఇప్పటికే ఈ పాటకి ఏకంగా 100 మిలియన్ వ్యూస్ పైగా వచ్చాయి అంటే… సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ లైన్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సినిమా లో సాయి పల్లవి కి డాన్స్ నేర్పించే డాన్స్ మాస్టర్ గా నాగ చైతన్య కన్పించనున్నాడట. అప్పట్లో వచ్చిన రాజా సినిమా లో వెంకటేష్ క్యారెక్టర్ మాదిరిగా చైతన్య క్యారెక్టర్ ఉండనుందని, జుంబా డాన్స్ మాస్టర్ గా నాగ చైతన్య కొత్త అవతారం లో అలరించనున్నాడని చెప్తున్నారు. అంతే కాదు, ప్రస్తుతం లవ్ స్టోరీ అనగానే సాయి పల్లవి నే గుర్తొస్తుంది కానీ సినిమా రిలీజ్ తర్వాత గుర్తుండి పోయే పాత్ర గా చైతన్య క్యారెక్టర్ ని శేఖర్ డిజైన్ చేసాడంటున్నారు. అంటే సాయి పల్లవి ని డామినేట్ చేసే రేంజ్ లో చైతూ పెర్ఫామెన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. సినిమా ఫస్ట్ కాపీ కూడా రెడీ గా పెట్టుకుని సోలో రిలీజ్ డేట్ ని మిస్ చేసుకున్న లవ్ స్టోరీ కొత్త రిలీజ్ డేట్ కోసం ఇప్పుడు అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.













