2024లో క్రేజీ సీక్వెల్స్ రిలీజ్
ఈ మధ్య హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేయడం ట్రెండ్ అయిపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సీక్వెల్స్ కూడా బాగా కలెక్ట్ చేయడంతో నిర్మాతలు వెనుకడుగు వేయడం లేదు. సౌత్ లో ఎక్కువ బజ్ ఉన్న సీక్వెల్స్ అన్నీ వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 వచ్చే సంవత్సరం ఆగస్ట్ 15న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్2 కూడా 2024లోనే రిలీజ్ కానుంది. రిషబ్ శెట్టి కాంతారా2 వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి. వీటితో పాటూ మరో అరడజను సీక్వెన్స్ సినిమాలు వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి. ఆర్జీవీ వ్యూహం2 జనవరి 26న రిలీజ్ కానుంది. రామ్-పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ వచ్చే మార్చిలో రిలీజ్ కానుంది.
మహి వి రాఘవ దర్శకత్వంలో వస్తున్న యాత్ర2 ఫిబ్రవరి లో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇవి కాకుండా ఎంతో క్రేజీ ఫిల్మ్ డీజే టిల్లు సీక్వెల్ గా వస్ఉన్న టిల్లూ స్వ్కేర్ కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అడివి శేష్ గూఢచారి2 2024లో రానుంది. ఇలా దాదాపు 10 క్రేజీ సీక్వెల్ సినిమాలు 2024లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలు ఆడియన్స్ ను మెప్పించి, నిర్మాతలకు కనకవర్షం కురిపిస్తాయో చూడాలి.













