War2VsCollie: వార్2 తో పోటీ పడనున్న కూలీ
ఈ మధ్య పెద్ద సినిమాలకు సోలో రిలీజ్ దక్కడం కష్టంగా మారింది. అంతేకాదు ముందు చెప్పిన డేట్ కు కూడా సినిమాలు రిలీజవడం లేదు. అంతేకాదు పెద్ద సినిమాల రిలీజ్ డేట్ విషయంలో లేట్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ మిగిలిన సినిమాలపై పడుతుంది. సరైన ప్లానింగ్, నిర్మాతల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్ వస్తుంది.
ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో రూపొందుతున్న వార్2(War2) సినిమాను ఆగస్ట్ 14న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) ఆ దిశగానే షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజిగా ఉన్నాడు. కానీ ఇప్పుడదే డేట్ పై రజినీకాంత్(rajinikanth) కూలీ(Coolie) కూడా కన్నేసినట్టు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కూలీని ముందు సమ్మర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అప్పటికి వర్క్స్ పూర్తయ్యేలా లేకపోవడంతో జైలర్(Jailer) రిలీజైన ఆగస్ట్ నెలని సెంటిమెంట్ గా భావించి అదే ఫాలో అవాలని చూస్తున్నారు.
అయితే కూలీ సినిమాను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) బ్రాండ్ తో పాటూ ఉపేంద్ర(Upendra), నాగార్జున(Nagarjuna), అమీర్ ఖాన్(Amir Khan), శృతి హాసన్(Shruthi Haasan) లాంటి పేర్లు సినిమాకు క్రేజ్ ను పెంచుతున్నాయి. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే ఈ సినిమా పై మంచి బజ్ పెరిగింది. కాబట్టి కూలీ ని లైట్ తీసుకోలేం. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం వార్2కి సౌత్ లో పెద్ద ఎఫెక్టే ఉంటుంది. కూలీ రిలీజ్ డేట్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఆల్మోస్ట్ డెసిషన్ తీసుకున్నారంటున్నారు.













