కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ సీజన్ 2.. చైర్మన్ స్థానంలో హిలేరియస్‌గా ఎంటర్టైన్ చేయటానికి సిద్ధమవుతోన్న అనీల్ రావిపూడి
అన్లిమెటెడ్ఎంటర్టైన్మెంట్ తో ఆడియెన్స్‌ను అలరిస్తోన్న వన్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధమ్యం ఆహా. ప్రేక్షకులకు తిరుగులేని వినోదాన్ని అందించిన కామెడీ స్టాక్ ఎక్సేంజ్ సీజన్ 2 నవంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కడుపుబ్బా నవ్వించే ఈ కామెడీ తొలి సీజన్‌కు తిరగులేని ఆదరణ దక్కింది. దీంతో రెండో సీజన్‌పై మంచి అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కామెడీ ఎక్స్చేంజ్ సీజన్ 2ను సైడ్ స్పిట్లింగ్ ప్రోమోతో ఆహా కన్ఫర్మ్ చేసింది. హద్దుల్లేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ తొలి సీజన్‌ను మించేలా రెట్టింపు వినోదాన్ని సీజన్ 2లో అందించబోతున్నామని అనీల్ రావిపూడి ప్రోమోలో తెలియజేశారు. ఎప్పుడెప్పుడు సీజన్ 2 రానుందా అని ఎదురు చూసిన ప్రేక్షకుల ఉత్సాహాన్ని, ఎగ్జయిట్‌మెంట్‌ను సీజన్ 2 ప్రోమో మరింతగా పెంచింది.
కామెడీ స్టాక్ ఎక్సేంజ్ సీజన్ 2 ప్రోమోను గమనిస్తే హరి, సద్దాం, రోహిణి, అవినాష్, జ్ఞానేశ్వర్ – భాస్కర్ వంటి కంటెస్టెంట్స్ చేసిన కామెడీ ప్రదర్శనలు ఆక్టుకుంటున్నాయి. ఈ ప్రోమోలో ఆకట్టుకున్న మరో విషయమేమంటే అనీల్ రావిపూడితో పాటు అతిథులుగా నరేష్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్, దక్షానగార్కర్ స్టార్స్ పాల్గొన్నారు. వీరు ప్రదర్శనలోని కామెడీని తెగ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. సీజన్ 1ను హోస్ట్ చేసిన దీపికా పిల్లి స్థానంలో ఇప్పుడు సీజన్ 2ను స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తుండటం కొస మెరుపు.
కామెడీ ఎక్సేంజ్ తొలి సీజన్ మంచి వ్యూయర్ షిప్‌ను సాధించటంతో పాటు కామెడీ కేటగిరీలో టాలెంట్ ట్రాక్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. చక్కటి కామెడీతో కమెడియన్స్ ఈ సీజన్‌ను సక్సెస్ఫుల్ చేసినందుకు యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేసింది. ఈ షోలో ఆరుగురు కమెడియన్స్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్టాక్‌ను రెప్రంజెట్ చేస్తుంటారు. ముక్కు అవినాష్, యాదమ రాజు, రోహిణి, ఎక్స్‌ప్రెస్ హరి, జ్ఞానేశ్వర్-భాస్కర్ ద్వయం, సద్దాం హుస్సేన్ ఈ కమెడియన్స్ లిస్టులో ఉన్నారు. ఇన్వెస్టర్స్‌గా ఈ షో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. వీరు కామెడీ స్టాక్ ఎక్సేంజ్ యాప్‌ను తమ మొబైల్స్‌లో ఉపయోగించుకోవచ్చు. అలాగే కంటెంస్టెంట్స్ పెర్ఫామెన్స్‌కు తగ్గ ఓటింగ్‌ను కూడా ఇవ్వొచ్చు. ఇది వారి కామెడి ఇండెక్స్‌పై ప్రభావం చూపిస్తుంది. కమెడియన్స్ చేసిన కామెడీ ఆధారంగా వారి ఇండెక్స్ పెరుగుతూ తగ్గుతుంటాయి. చక్కటి ఎంటర్టైన్మెంట్ అందించిన వారి స్టాక్ వేల్యూ పెరుగుతుంది.
ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోన్న స్టాక్ ఎక్సేంజ్ సీజన్ 2 లో అనీల్ రావిపూడి కొంత ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని సూచనలున్నాయని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. స్టాక్ ఎక్సేంజ్ సీజన్ 2 అనేది యాప్‌లో నవంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు సరికొత్తగా ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సీజన్లో మొత్తంగా పది ఎపిసోడ్స్ ఉంటాయి.
About aha
Launched in 2020, aha is an Indian video-on-demand streaming service that provides 100% local entertainment. It started out with a 100% Telugu OTT and witnessed great success across the world with its extensive content slate that includes original programming of web series and movies, with a new release every Friday. Fulfilling its promise of 100% Local entertainment, aha has launched aha Tamil in 2022. aha is a joint venture by My Home Group and Allu Aravind (Geetha Arts).













