పెళ్లి పీటలెక్కనున్న స్వాతి
ప్రముఖ నటి స్వాతి వివాహం నిశ్చయమైంది. వికాస్ అనే పైలెట్‌ని ఆమె ఈ నెల 30న హైదరాబాద్‌లో వివాహం చేసుకోబోంది. వికాస్‌ది ఇండోనేషియాలోని జకార్తా. మలేసియన్ ఎయిర్‌లైన్స్‌లో పైలెట్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా స్వాతి, వికాస్ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. పెద్దల్ని ఒప్పించి వీరిద్దరూ ఒక్కటవ్వబోతున్నారు. సెప్టెంబరు 2న కొచ్చిలో వివాహ విందు ఇవ్వబోతోంది ఈ జంట. పెళ్లయ్యాక దంపతులిద్దరూ ఇండోనేసియాలో స్థిరపడతారని, స్వాతి సినిమాలకు దూరం కానున్నదని తెలుస్తోంది. డేంజర్ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన స్వాతి, అష్టాచమ్మా, కార్తికేయ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. తమిళం లోనూ స్వాతి సుపరిచితురాలే.













