Vidudhala3: విడుదల3 క్లారిటీ వచ్చేసిందిగా!
విజయ్ సేతుపతి(Vijay Sethupathi), వెట్రిమారన్(Vetrimaran) కాంబినేషన్ లో రూపొందిన విడుదల-2(Vidudhala2) రిలీజై ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ పార్ట్ ను ఇష్టపడిన వాళ్లు సీక్వెల్ మీద డబుల్ ఇంట్రెస్ట్ తో ఎదురుచూశారు. ఇప్పటివరకు తమిళంలో సెకండ్ పార్టులు వర్కవుట్ అయిన దాఖలాలు లేవు. అందుకే ఈ సినిమా అయినా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా అనే అనుమానాలు కలిగాయి.
అయితే విడుదల-2 రిలీజ్ కు ముందు ఈ సినిమా నిడివి ఎడిటింగ్ చేయకుండా నాలుగున్నర గంటలకు పైగా వచ్చిందనే న్యూస్ కోలీవుడ్ వర్గాల్లో బాగా ప్రచారమైంది. దీంతో విడుదల3(Vidudhala3) కూడా ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ సినిమా చూశాక అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. వెట్రిమారన్ ఈ కథను రెండు పార్టులతో ముగించేశాడు.
తమిళనాడులో వరకు ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి తెలుగులో ఏ రేంజ్ లో ఆడియన్స్ ను అలరిస్తుందో చెప్పడం కష్టమే. సీరియస్ టోన్ లో సాగే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఉన్నంత గ్రిప్పింగ్ లేదనే కామెంట్స్ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. దానికి తోడు ఇళయరాజా(Ilayaraja) సంగీతం కూడా ఏమంత గొప్పగా లేదు. మరి చూడాలి విడుదల2 ఫైనల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.













