ఉస్తాద్ నుంచి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రానున్న ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ తిరిగి ఎప్పుడు మొదలవుతుందోననే విషయంలో చాలా రోజులుగా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఏపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న పవన్ ఇప్పట్లో సినిమాలు చేస్తాడా అని కూడా అనుకున్నారు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం పవన్ ముందుగా ఓజి సినిమాను పూర్తి చేస్తాడని తెలుస్తోంది.
దాంతో పాటూ హరిహర వీరమల్లు కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా ఫినిష్ చేస్తాడన్నారు. దీనివల్ల ఉస్తాద్ భగత్‌సింగ్ పూర్తి చేయడానికి ఇంకా చాలానే టైమ్ పడుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్‌సింగ్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఆ సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ గా పవన్ తో ప్రత్యేకంగా మాట్లాడానని, పవన్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పాడు.
అంతేకాదు త్వరలోనే అనుకున్నట్లు సినిమా షూటింగ్ స్టార్టవుతుందని, సినిమా మొత్తం ఈ ఇయర్ డిసెంబర్ లేదా వచ్చే సంక్రాంతి లోపు ఫినిష్ అయ్యే అవకాశముందని తెలిపాడు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా తమ సినిమా నుంచి ఏదొక అప్డేట్ ను కచ్ఛితంగా ఇవ్వనున్నామని ఆయన పవన్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో పవన్ వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండనున్నట్లు అర్థమవుతుంది.













