ఈ వారం మూవీ లవర్స్ కోసం ఓటీటీ లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
వీకెండ్ వస్తుంది అంటే అటు థియేటర్లో సినిమాలతో పాటు ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సరికొత్త మూవీస్ ,వెబ్ సిరీస్ మూవీ లవర్స్ కోసం సిద్ధమవుతాయి. అయితే ఈ వీకెండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న ఆ సినిమాలు ఏమిటో తెలుసుకుందామా.. ఈ వారం థియేటర్లలో ‘మెకానిక్ రాకీ’, ‘దేవకీ నందన వాసుదేవ’, ‘కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్)’, ‘మందిర’, ‘రోటి కపడా రొమాన్స్’ వంటి విభిన్న కథా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ కేవలం థియేటర్స్ మాత్రమే కాదు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా సందడి మరింత ఎక్కువగా ఉంది. మరి ఆ మూవీలు, వెబ్ సిరీస్ లు ఏమిటో ఓ లుక్ వేద్దాం పదండి..
అమెజాన్ ప్రైమ్:
– క్యాంపస్ బీట్స్ 2 (హిందీ సిరీస్) – నవంబరు 20 నుంచి.
డిస్నీ+ హాట్‌స్టార్:
– ఇంటీరియర్ చైనా టౌన్ (వెబ్‌సిరీస్) – నవంబరు 19.
– కిష్కిందకాండమ్ (మలయాళం/తెలుగు) – నవంబరు 19.
– ఏలియన్ రొమ్యులస్ – నవంబరు 21.
జియో సినిమా:
– డ్యూన్: ప్రొఫెసి (వెబ్‌సిరీస్) – నవంబరు 18.
– హరోల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్ – నవంబరు 23.
నెట్‌ఫ్లిక్స్:
– వాండరూస్ 2 (యానిమేషన్) – నవంబరు 18.
– జాంబీ వర్స్ (కొరియన్ సిరీస్) – నవంబరు 19.
– పోకెమాన్ హారిజాన్స్ ది సిరీస్ 4 – నవంబరు 22.
ఈటీవీ విన్:
– ఐ హేట్ లవ్ (తెలుగు) – నవంబరు 21.
– రేపటి వెలుగు (తెలుగు) – నవంబరు 21.
ఇక మీరు థియేటర్‌కి వెళ్తారా? లేక ఇంట్లోనే ఓటీటీ కంటెంట్ చూడాలనుకుంటారా?













