మా సభ్యులకు అవకాశాలు కల్పించాలి
తెలుగు సినిమాల్లో తెలుగువారికి అవకాశాలు ఇవ్వాలని, ముఖ్యంగా మా సభ్యులకు అవకాశాలిచ్చి ప్రోత్సహించాలని కోరుతూ మా అధ్యక్షుడు డా.వి.కె.నరేష్, ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ తదితరులు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్రటరీ సుప్రియ, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు, ఎన్.శంకర్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, తెలుగు చలన చిత్ర రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణలను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న చాలా మంది సినిమాల్లో అవకాశాల లేక బాధపడుతున్నారు. వారి కోసం మేము ఈ నాలుగు సంస్థల అధ్యక్షులను కలిసి వినతి పత్రం సమర్పించాం. ముఖ్యంగా ఆడవాళ్లు వేషాలు లేక చాలా బాధల్లో ఉన్నారని వారికి వివరిచాం. మా కోసం మేము ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ను ప్లాన్ చేస్తున్నాం. ఆ వెబ్సైట్లో దాదాపు అందరి ఆర్టిస్టుల అడ్రసులు, ఫోన్ నెంబర్లతో పాటు వాళ్లు చేసిన ఒక నిమిషం ఫర్మార్మెన్స్ వీడియో తదితర వివరాలను పొందుపరుస్తాం అని తెలిపారు.













