విక్రమ్ యాక్టింగ్ కు ఎన్ని అవార్డులిచ్చినా తక్కువే
విలక్షణ నటుడు కమల్‌హాసన్ తర్వాత ఆయన్ను మ్యాచ్ చేయగల వైవిధ్యమైన హీరో అంటే చియాన్ విక్రమ్‌నే. తన యాక్టింగ్ గురించి, డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక క్యారెక్టర్ కోసం విక్రమ్ ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. ఇప్పుడు విక్రమ్ తాజాగా తంగలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ్చాడు.
విక్రమ్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఒకెత్తయితే ఇందులో చేసిన పాత్ర మరొక ఎత్తు అనేలా ఉంది ఇందులో అతని క్యారెక్టర్. తంగలాన్ లో విక్రమ్ యాక్టింగ్, లుక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మూవీ స్టార్ట్ అయిన కాసేపటి తర్వాత నుంచే అసలు సినిమాలో మనం చూస్తున్నది విక్రమ్‌ని అనే విషయం మర్చిపోతాం.
సినిమాలోని తంగలాన్ అనే క్యారెక్టర్ తో ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయిపోతారు. ఆ పాత్రలో విక్రమ్ అంతగా ఒదిగిపోయాడు. ఆ క్యారెక్టర్ కోసం విక్రమ్ ఎంత మేకోవర్ చేశాడనేది ఊహించడానికి కూడా కష్టమే. యాక్టింగ్ పరంగా కూడా విక్రమ్ ప్రతీ సీన్ లోనూ వావ్ అనిపిస్తాడు. సినిమా ఎలా ఉన్నా విక్రమ్ ను చూడ్డానికి అయినా తంగలాన్ ను ఒకసారి చూడొచ్చనేలా సినిమా ఉంది. ఈ సినిమాలో విక్రమ్ యాక్టింగ్ కు మరోసారి నేషనల్ అవార్డు రావడం పక్కా అనేలా ఉంది.













