మెగా156 లో 70% వీఎఫ్ఎక్స్
భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బింబిసార ఫేమ్ వశిష్ఠతో చేయనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్లో 156వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. రీసెంట్గా లాంచ్ అయిన ఈ సినిమా డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుందంటున్నారు.
డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, సినిమా ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుందని తెలిపాడు. అంతేకాదు, ఈ సినిమాలో విజుల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత గురించి కూడా వశిష్ఠ వివరించాడు. విశ్వంభర్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 70% పైగా విఎఫ్ఎక్స్తో ముడిపడ్డ సీన్సే ఉంటాయని అతను వెల్లడించాడు.
ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి తానెంతో ఎగ్జయిటెడ్ గా ఉన్నట్లు వశిష్ఠ తెలిపాడు. సృష్టిలో ఎంతో ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి లాంటి అంశాలకు ఆధ్యాత్మికతను జోడిస్తూ విశ్వంభరలో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్లు వశిష్ఠ వెల్లడించాడు. కీరవాణి సంగీతం అందించనున్న ఈ సినిమాలో పలువురు హీరోయిన్లు నటించబోతున్నట్లు సమాచారం.













