చిరూ లేకుండానే కానిచ్చేస్తున్నారుగా!
భోళా శంకర్ డిజాస్టర్ అవడంతో కళ్యాణ్ కృష్ణతో అనుకున్న కథను పక్కకు పెట్టి మరీ చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్ఠతో తన 156వ సినిమాను పట్టాలెక్కించాడు. వాస్తవానికి కళ్యాణ్ కృష్ణ సినిమా అయ్యాక వశిష్ఠతో సినిమా చేయాల్సింది కానీ భోళా శంకర్ రిజల్ట్ ఇచ్చిన ఎఫెక్ట్ తో చిరూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది.
మారేడుమిల్లి అడవుల్లో మొదటి షెడ్యూల్ ను మొదలుపెట్టిన వశిష్ఠ, ఆయన లేకుండానే ఆ షెడ్యూల్ ను పూర్తి చేశాడు. త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా మొదలుకానున్నట్లు తెలుస్తోంది. రెండో షెడ్యూల్ స్టార్ట్ అయిన వెంటనే కూడా చిరూ ఈ షూటింగ్లో జాయిన్ అవడం లేదట. రీసెంట్ గా మోకాళ్ల సర్జీరీ చేయించుకున్న చిరూ, ఓ వైపు నెమ్మదిగా కోలుకుంటూనే మరోవైపు వశిష్ఠతో చేయబోయే మూవీ కోసం మేకోవర్ చేస్తున్నాడట.
అందుకు మరో నెల రోజుల టైమ్ పడుతుందని, జనవరి నెలాఖరున కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కానీ చిరంజీవి ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నాడని తెలుస్తోంది. అప్పటినుంచి సినిమా పూర్తయ్యే వరకు రెస్ట్ లేకుండా షూటింగ్ చేయనున్నాడని తెలుస్తోంది. అప్పటివరకు వశిష్ఠ చిరూ లేని సీన్స్ షూట్ చేయబోతున్నాడట. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ను అనుకుంటున్నారు. సంక్రాంతికి టైటిల్ను అనౌన్స్చేసే ఛాన్సుంది.













