Viswambhara: విశ్వంభర ఇకనైనా జాగ్రత్త పడాలి
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా బింబిసార(Bimbisara) డైరెక్టర్ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో విశ్వంభర(Viswambhara) సినిమా వస్తుందని తెలిసినప్పుడు ఆ సినిమాపై అందరికీ అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సినిమా నుంచి టీజర్ రిలీజైందో అప్పుడే సినిమాపై ఉన్న హైప్ తగ్గింది. టీజర్ లోని విఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. దీంతో మేకర్స్ వెంటనే వీఎఫ్ఎక్స్ టీమ్ ను మార్చి బెస్ట్ రిజల్ట్ కోసం వర్క్ చేస్తోంది.
ఇక రీసెంట్ గా విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. రామ రామ అంటూ కీరవాణి(Keeravani) కంపోజ్ చేసిన ఈ సాంగ్ వినడానికి బాగుంది. వినడానికి బావున్నప్పటికీ ఆ పాట చార్ట్ బస్టర్ అయ్యేంత హిట్ అయితే కాదు. దానికి కారణం కీరవాణి ఇచ్చిన ట్యూన్ ట్రెండీగా లేకపోవడమే. దీంతో విశ్వంభర టీమ్ వేసిన రెండో అడుగు కూడా సినిమాపై హైప్ ను పెంచలేకపోయింది.
కాబట్టి సినిమా నుంచి నెక్ట్స్ రిలీజ్ చేసే కంటెంట్ తో ఆడియన్స్ కు హై ఇవ్వడంతో పాటూ అంచనాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఆడియన్స్ విశ్వంభరను లైట్ తీసుకునే అవకాశం లేకపోలేదు. మేకర్స్ ఈ దిశగా ఆలోచించి ఎలాగైనా నెక్ట్స్ విశ్వంభర నుంచి అదిరిపోయే కంటెంట్ తో రావాలి. అది తప్ప సినిమాపై హైప్ పెంచే మార్గం మరోటి లేదు.













