Chiranjeevi: మంచి పాత్ర వస్తే ఓటీటీకి రెడీ

తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ హీరోలు కొందరు ఆల్రెడీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వెంకటేష్(venkatesh) రానా నాయుడు(rana naidu) వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రపంచం లోకి అడుగుపెట్టగా, బాలకృష్ణ(balakrishna) అన్‌స్టాపబుల్(Unstoppable) షో ద్వారా ఓటీటీ ప్రేక్షకులకు చేరువయ్యాడు. నాగార్జున(nagarjuna) కూడా త్వరలోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు రాగా, చిరంజీవి(chiranjeevi) మాత్రం ఓటీటీలోకి వస్తాడని ఎవరూ అనుకోలేదు.
అయితే తాజాగా జరిగిన కుబేర విజయోత్సవ సభలో చిరంజీవి తాను కూడా ఓటీటీ ఎంట్రీకి రెడీగా ఉన్నట్టు వెల్లడించాడు. మంచి పాత్ర వస్తే ఓటీటీలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చిరూ చెప్పాడు. భవిష్యత్తులో అవసరమైతే ఓటీటీలో సినిమాలు చేయడానికి కూడా తాను రెడీగా ఉన్నానని, ఇప్పట్నుంచే దానికి మానసికంగా రెడీ అవాలని పేర్కొన్నాడు చిరూ.
ఓకే అన్నాను కదా అని రేపు ఉదయమే కథలతో తన ముందుకు రావొద్దని సరదాగా వ్యాఖ్యానించాడు చిరూ. ఒకవేళ నిజంగా చిరూ ఓటీటీ ఎంట్రీ ఇచ్చి ప్రాజెక్టు చేస్తే అది చిరూ కెరీర్లో మరో మైల్ స్టోన్ అవడం ఖాయం. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు చిరూ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటినుంచి ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూనే ఉన్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఓటీటీ ట్రెండ్ కు కూడా ఆయన రెడీ అయ్యాడు.