వారు చేసిన సేవలు చాలా గొప్పవి: మెగాస్టార్
కరోనా మహమ్మారి కోరలు చాచిన సమయంలో ప్రజలంతా ఇంటికే పరిమితమై బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రాణాలను ఫణంగా పెట్టి వారి సేవలు అందించారు. వారు చేసిన సేవలని ఎంత ప్రశంసించిన తక్కువే. నిద్రాహారాలు మాని మరి విధులు నిర్వర్తించిన వైద్యులు ఎంతో మందికి ప్రాణం పోశారు. వారిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. చిరు ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రికికి స్వయంగా వెళ్లి అక్కడి వైద్యులని కలిసి వారిని ప్రశంసించారు. తన ట్విట్టర్లో వారితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఏజీఐ ఆసుపత్రికి వెళ్లి అక్కడి డాక్టర్లను కలిసే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా సమయంలో వారు చేసిన సేవలు చాలా గొప్పవి. క్లిష్ట సమయంలో ఆసుపత్రిని ఎంతో చాకచక్యంగా ముందుకు తీసుకువెళ్లిన పద్మభూషణ్ అవార్డు గ్రహిత హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.













