మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఆరంభంలో అమ్మ సహకారం ఎంతైనా వుంది
మెగాస్టార్ చిరంజీవి చిత్రం అంటేనే ఓ క్రేజ్, చిరంజీవి అనే పేరు ఒక ఊపు. తెలుగులోనే కాదు ఇండియన్ సినిమాలో చిరంజీవి అనే పేరు ఒక ఎనర్జీ ఒక ఊపు. చిరంజీవి జీవితం గురించో చిరంజీవి సినిమాల గురించో ఆయన వార్తల్లో ఉన్నా లేకపోయినా సరే చర్చలు జరుపుతూ ఉంటారు. ఆయన చేసిన సినిమాలు ఆయన పోషించిన పాత్రలు ఆయన సాధించిన విజయాలు ఆయన వ్యక్తిత్వం అన్నీ కూడా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఉన్నవే. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన జీవితంలో తల్లి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటారు. ఇక చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎక్కువగా అగ్ర హీరోలే ఉండే వారు. టాలీవుడ్ లో అప్పుడు భారీ సినిమాలు అంటే ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళ నలుగురి సినిమాలే ఎక్కువగా కనపడుతూ ఉండేవి వీరి సినిమా లేకుండా ఓ థియేటర్ కూడా కాళి గా ఉండేది కాదు. కాని ఆ సమయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు డాన్స్ లు, ఫైట్స్ లతో ప్రత్యేకంగా కనపడుతుండేవి. అప్పటి అగ్ర హీరోల పోటీ తట్టుకుని వారికి దీటు గా ఆయన ఎదిగారు. వారి తో పోటీ గా ఆయన సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాల్లో కూడా చిరంజీవి సినిమాలు సూపర్ హిట్ అయి నిలదొక్కుకున్నాయి
మాస్ కి బాగా దగ్గరైన హీరో గా చిరంజీవికి మంచి గుర్తింపు ఉండేది. దీనికి కారణం ఆయన తల్లి అని అంటారు. చిరంజీవి తొలి రోజుల్లో తన కెరీర్ విషయం లో చాలా భయపడుతూ ఉండే వారని, ఆయనకు కథలు వినడం కూడా సరిగ్గా వచ్చేది కాదని, కాని తల్లి జోక్యం చేసుకుని ప్రతీ చిన్న విషయాన్ని కూడా పట్టించుకుని కొడిక్కి తన వంతు ప్రోత్సాహం ఆమె అందించే వారని అంటారు. తొలుత నుండి ఆమె వలనే ఆయన ఈ స్థాయిలో ఉన్నారట. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా తెలుగు టైమ్స్.నెట్ అందిస్తున్న చిన్న ఫ్లాష్ బ్యాక్.













