చిరంజీవి తాత “మిమ్మి మిమ్మి” పాటే కావలి అంటూ మారాం చేసిన మనవరాలు
ఒక విధం గా ఈ కరోనా ఇదివరకెపుడు ఇవ్వని ఇంకెప్పుడు పొందని ఆనందాన్ని కూడా ఇచ్చింది అని చెప్పవచ్చు, ఈ లాక్ డౌన్ ఇంటికే పరిమితమైన సెలబ్రిటీస్ కు రోజంతా తన వాళ్ళతో గడిపే అవకాశం ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి మనవరాలికి కూడా తన తాత పాటంటే ఎంత ఇష్టమో ఈ క్రింది వీడియో చూస్తే అర్ధం అవుతుంది. టి వి ముందు కూర్చుని మారనవరాలిని వొళ్ళో కూర్చోపెట్టుకుని నీకు ఈ పాట కావాలమ్మా అంటే ఏడాది పాప “మిమ్మి మిమ్మి” అంటూ అడిగింది ఖైదీ నంబర్ 150 సినిమాలో సాయంకాలనా….అనేపాట అది సరే ప్లే చేస్తా అని చిరంజీవి ఆ పాటను ప్లే చేసారు. దానికి అనుగుణంగా భుజాలు ఊపుతూ ఆడింది మనవరాలు మధ్యలో పాట స్టాప్ చేయగానే ఒకటె ఏడుపు మల్లి ఏ పాట కావాలని అడిగితే అదే ఆన్సర్ “మిమ్మి మిమ్మి” అని ఆ పాట లో తన తాతే డాన్స్ చేసాడని కూడా తెలియని ఆ పసిపాపకూ అభిమాన హీరో అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి.













