వీణాపాణికి మెగాస్టార్ సత్కారం …
మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా లండన్లోని భవన్స్ ప్రాంగణంలో సంగీత వేడుక జరిగింది. సంగీతంలోని విశిష్టమైన 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61 గంటల 20 నిమిషాల పాటు వీణావాదన చేసి గిన్నిస్ సొంతం చేసుకున్నారు తెలుగు సినిమా సంగీత దర్శకుడు వీణాపాణి. ఈ సందర్భంగా ఆయనను మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో సత్కరించారు. ఇంత గొప్ప గౌరవం దక్కటం తెలుగువారితో పాటు, భారతీయులందరి అదృష్టం. ఇటువంటి కళాకారులను వ్యక్తిగతంగా, వృత్తిగతంగా గౌరవించడం మన సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం అని చిరంజీవి అన్నారు. ఈ అవార్డును మహాత్మునికి అంకితమిస్తున్నట్టు వీణాపాణి చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు తనికెళ్ళ భరణి, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు శివ నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.













