మెగాస్టార్ బాబీ సినిమా ఆ బ్యాక్ డ్రాప్ లోనేనా..?
మెగాస్టార్ చిరూ, డైరక్టర్ బాబీ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు కూడా. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో చిరూ ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత మోహన్ రాజా డైరక్షన్ లో లూసిఫర్ రీమేక్, మెహర్ రమేష్ తో వేదాళమ్ రీమేక్ లు చేయనున్నారు చిరూ. ఆ తర్వాత బాబీ తో సినిమా మొదలయ్యే ఛాన్సులున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. బాబీ తెరకెక్కించిన జై లవకుశ, వెంకీ మామ తరహాలోనే ఈ సినిమా కూడా ఎమోషన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట. 90స్ లో అలాంటి సినిమాల్లో నటించిన మెగాస్టార్ ఆ తర్వాత పెద్దగా రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ని టచ్ చేసింది లేదు. ఇప్పుడు మళ్లీ బాబీతో అలాంటి సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కోన వెంకట్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.













