Chiranjeevi :ఇక జన్మంతా రాజకీయాలకు దూరంగా.. సినిమాలకు దగ్గరగా
ఇక ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా, సినిమా(Movie)లకు దగ్గరగా ఉంటానని అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi) చెప్పారు. హైదరాబాద్లో జరిగిన బ్రహ్మా ఆనందం ముందుస్తు విడుదల వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన దీనిపై మాట్లాడారు. నా గురించి చాలామందిలో సందేహాలున్నాయి. పెద్దవాళ్లకు దగ్గరవుతున్నాడు, రాజకీయాల (Politics) వైపు వెళ్తాడా అన్నట్టు చూస్తున్నారు. అదేమీ కాదు. మరోరకంగా సేవలు అందించడానికే తప్ప, రాజకీయంగా వెళ్లడానికి కాదు. రాజకీయంగా నా లక్ష్యాలు, సేవలను కొనసాగించడానికి పవన్ కల్యాణ్ ఉన్నారు అని తెలిపారు.













