Chiranjeevi: చిరంజీవి ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడా?
వశిష్ట(Vassishta) దర్శకత్వంలో విశ్వంభర(Viswambhara)ను పూర్తి చేసే పనిలో ఉన్న చిరంజీవి(Chiranjeevi) ఓ వైపు సినిమాలను చేస్తూనే మరోవైపు తన తర్వాతి సినిమాల కోసం కథలను విని ఏవైనా నచ్చితే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం చిరూ చేతిలో విశ్వంభర కాకుండా మరో రెండు సినిమాలున్నాయి. అందులో అనిల్ రావిపూడి(Anil Ravipudi) మూవీ కూడా ఒకటి.
ఈ సినిమా షూటింగ్ సమ్మర్ లో మొదలవుతుందని ఆల్రెడీ చిరూ చెప్పాడు. ఈ కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నానన్న చిరూ, ఎప్పుడెప్పుడు ఈ మూవీలో నటిస్తానా అని ఆతృతగా ఉన్నట్టు చెప్పాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు కూడా చిరూ తెలిపాడు.
వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతికి చిరూ నుంచి సినిమా వస్తుందని అందరూ ఫిక్స్ అయిన టైమ్ లో కొన్ని కారణాల వల్ల విశ్వంభర వాయిదా పడింది. దీంతో చిరూ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. అందుకే ఫ్యాన్స్ కోసం తర్వాతి సినిమానైనా సంక్రాంతికి రిలీజ్ చేసి వారిని సంతోష పెట్టాలని చూస్తున్నాడు చిరూ. మరి ఈ సారైనా చిరూ ఫ్యాన్స్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.













