ఇప్పుడైనా చాందినీకి బ్రేక్ వస్తుందా?
చాందినీ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ తెలుగమ్మాయి హీరోయిన్ గా నటించిన కలర్ ఫోటో సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. అయినా సరే చాందినీకి ఆశించిన బ్రేక్ దక్కలేదు. టాలెంట్, అందం రెండ ఉన్నా సరే చాందినీ అవకాశాల విషయంలో చాలా వెనుకబడి ఉంది.
కిరణ్ అబ్బవరంతో చేసిన సమ్మతమే లాంటి సినిమాలో పేరొచ్చింది తప్పించి ఆఫర్లేమీ రాలేదు. అయితే వీటన్నింటని కంటే ఎప్పుడో చాలా ముందే ఒప్పుకున్న గామి సినిమా ఇప్పుడు చాందినీకి మంచి రిజల్ట్ ని ఇస్తోంది. విశ్వక్సేన్ హీరో అయినప్పటికీ కథలో తనతో పాటూ సగానికి పైగా సమానంగా ప్రయాణించే డాక్టర్ పాత్రలో చాందినీ చాలా బాగా నటించి అందరితో మంచి మార్కులు వేయించుకుంటుంది.
గడ్డలు కట్టించే చలిలో చాందినీ తీసుకున్న రిస్క్ స్క్రీన్ పై చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చాందినీ పడ్డ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడైనా తను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం చాందినీ బాలయ్య109లో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. ఆ పాత్ర తాలూకు వివరాలేమీ ఇంకా బయటకు రాలేదు. సినిమాలో బాలయ్యతో చాందినీ పాత్రకు చాలా బలమైన బాండింగ్ ఉండేలా డైరెక్టర్ ఆ పాత్రను డిజైన్ చేశాడంటున్నారు. బాలయ్య109 హిట్ అయితే చాందినీ కెరీర్ లో మరిన్ని అవకాశాలందుకునే ఛాన్సుంది. అయినా తెలుగు టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే డైరెక్టర్లందరూ చాందినీకి ఎందుకు అవకాశాలివ్వడం లేదో వాళ్లకే తెలియాలి.













