Fauji: ఫౌజీ లో మరో హీరోయిన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న పలు సినిమాల నుంచి మేకర్స్ అప్డేట్స్ ను ఇవ్వగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వచ్చిన అప్డేట్స్ అందరినీ విపరీతంగా ఆకర్షించింది ఫౌజీ(fauzi) మూవీనే. హను రాఘవపూడి(hanu raghavapudi) డైరెక్షన్ లో ప్రభాస్ ఓ మూవీ చేస్తుండగా, దానికి ఫౌజీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.
ఈ లుక్ లో ప్రభాస్ చాలా కొత్త అవతారంలో కనిపించగా, ఆ లుక్ ను చూసి ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. యుద్ధ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయెల్(Imanvi esmael) హీరోయిన్ గా నటిస్తుండగా ఈ మూవీలో మరో నటి ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. కన్నడ నటి, సింగర్ చైత్ర జై. ఆచార్(chaitra jai. aachar) ఫౌజీలో ఓ కీలక పాత్రలో నటించనుందట.
చైత్ర గతంలో సప్త సాగరాలు దాటి(sapta sagaralu daati), 3BHK లాంటి మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఇప్పుడు ఫౌజీలో భాగమైనట్టు కన్ఫర్మ్ చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.






