కుర్రాళ్ల ‘రేంజ్’ కి అద్దం పట్టేలా ఈ చిత్రం
చైతన్యవంశీ ప్రధాన పాత్రధారిగా యశ్విత ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం రేంజ్. హేంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గుడాల నవీన్ నిర్మాత. జెమిని ప్రొడక్షన్ సమర్పిస్తోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జెమినీ సీఈఓ పీవీఆర్ మూర్తి క్లాప్‌నిచ్చారు. విభిన్నమైన యాక్షన్ చిత్రమిది. కుర్రాళ్ల రేంజ్‌కి అద్దం పట్టేలా ఉంటుంది. బహుభాషా చిత్రంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతోంది. నవంబర్ చివరి వారం నుంచి చిత్రీకరణ ఆరంభిస్తాం. యువ ప్రతిభని ప్రోత్సహిస్తూ జెమిని ప్రొడక్షన్ వరుసగా సినిమాల్ని నిర్మించనుందని సినీ వర్గాలు తెలిపాయి. సంగీతం: శక్తికాంత్ కార్తీక్, ఛాయాగ్రహణం: లక్ష్మీకాంతం కనికె, కూర్పు: గౌతంరాజు.













