Bunny Vasu: ఇండస్ట్రీలో మినిమం సేఫ్ అనేది లేదు

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కంటెంట్ ఈజ్ కింగ్ అని అందరూ అంటుంటారు. సినిమాలో మంచి కంటెంట్ ఉండి, దాన్ని ఆడియన్స్ కు సరిగ్గా రీచ్ అయ్యేలా చెప్తే ఏ సినిమా ఫెయిల్ అవదు. కొన్ని సినిమాల్లో కథ బావున్నా దాన్ని సరిగ్గా చెప్పలేకపోతే ఆ మూవీస్ ఫ్లాప్స్ గా మారి నిర్మాతలకు భారీ నష్టాలను మిగుల్చుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం ప్రొడక్షన్ పరంగా నిర్మాతలు ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రశ్న రీసెంట్ గా ఓ సినీ ఈవెంట్ కు గెస్టుగా హాజరైన బన్నీ వాసు(Bunny vasu)కు ఎదురైంది. దానికి ఆయన సమాధానమిస్తూ మనం వెనుకబడి పోతున్నామనో, మన పేరు, మన బ్యానర్ పేరుని ఆడియన్స్ మర్చిపోతున్నారనో తొందరపడి సినిమాలు చేస్తే ఏం రాదన్నారు.
ఒకప్పటిలా ఇండస్ట్రీలో మినిమం సేఫ్ అనే మాట ఇప్పుడు లేదని, దాన్ని ఆడియన్స్ మర్చిపోయారని, ఇప్పుడు రెండే ఉన్నాయని, ఒకటి డిజాస్టర్ లేదా సూపర్ హిట్. సూపర్ హిట్ అయితేనే డబ్బులు మిగులుతున్నాయని, డిజాస్టర్ అయితే పోస్టర్ల డబ్బులు కూడా నిర్మాతలకు రావడం లేదని బన్నీ వాసు చెప్పడంతో నిర్మాతలకు ఇన్ని కష్టాలున్నాయా అని అందరూ ఆలోచనలో పడ్డారు.