Bunny Vasu: రూ.45 తో కెరీర్ ను మొదలుపెట్టిన నిర్మాత

బన్నీ వాసు(bunny Vasu). టాలీవుడ్ లో ఇప్పుడు ఈయన గురించి తెలియని వారుండరు. సక్సెస్‌ఫుల్ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, అల్లు అర్జున్(Allu Arjun) కు ఫ్రెండ్ గా, అల్లు అరవింద్(Allu Aravind) కు అత్యంత సన్నిహితుడిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన్నుంచి రీసెంట్ టైమ్స్ లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా లిటిల్ హార్ట్స్(Little Hearts), మహావతార్ నరసింహ(Mahavtar Narasimha), కాంతార1(kanthara1) సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న బన్నీ వాసు ఇప్పుడు మిత్రమండలి(mitramandali) అనే మూవీతో మరోసారి తన లక్ ను పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. అక్టోబర్ 16న మిత్ర మండలి మూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న బన్నీ వాసు తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తనను కెరీర్ మొదటి నుంచే నమ్మాడని, ఆర్య మూవీ రిలీజైనప్పుడు పాలకొల్లు డిస్ట్రిబ్యూషన్ ను తీసుకోమని తనకు చెప్పడంతో పాటూ దిల్ రాజు(Dil Raju)తో కూడా మాట్లాడాడని, కానీ అప్పుడు తన దగ్గర రూ.45 మాత్రమే ఉన్నాయని దిల్ రాజుకు చెప్తే ఆయన నవ్వి, మిగిలినవి తర్వాత ఇమ్మన్నారని చెప్పాడు. ఆ రోజు రూ.45 తో కెరీర్ ను మొదలు పెట్టిన వాసు, ఇప్పుడు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారంటే ఆయన సక్సెస్ ప్రతీ ఒక్కరికీ ఆదర్శప్రాయమే.