పరశురామ్ తో గొడవ అదే- బన్నీ వాసు
గీతా ఆర్ట్స్ కు, పరశురామ్ కు ఉన్న బాండింగే వేరు. పరశురామ్ కష్టాల్లో ఉన్న టైమ్ లో గీతా ఆర్ట్స్ అతనికి ఛాన్స్ ఇచ్చింది. ఆ అవకాశాన్ని సరిగా వాడుకుని అల్లు శిరీష్‌కు శ్రీరస్తు శుభమస్తు రూపంలో ఓ మంచి హిట్ కూడా అందించాడు. దీంతో విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం సినిమా చేసే ఛాన్స్ ఇచ్చింది గీతా ఆర్ట్స్.
గీత గోవిందం మంచి హిట్ అవడంతో పరశురామ్ రేంజే మారిపోయింది. మహేష్ తో సర్కారు వారి పాట చేసిన పరశురామ్, ఆ సినిమా తర్వాత గీతా బ్యానర్ లోనే విజయ్ తో మరో సినిమా చేస్తాడని వార్తలు కూడా వచ్చాయి. కానీ పరశురామ్ మాత్రం ఆ వార్తలను కాదంటూ దిల్ రాజు బ్యానర్ లో విజయ్‌తోనే సినిమాను అనౌన్స్ చేయించుకోవడంతో అల్లు అరవింద్ బాగా హర్టయ్యాడు.
ఓ ఈవెంట్లో ఇన్‌డైరెక్ట్‌గా పరశురామ్ పై కామెంట్స్ కూడా చేశాడు అల్లు అరవింద్. తర్వాత ఆ గొడవ ఏమైందో తెలియదు కానీ రీసెంట్ గా బన్నీ వాసు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. విజయ్-పరశురామ్ కాంబోలో సినిమా చేయాలని చూస్తున్న తమకు పరశురామ్ చెప్పకుండా వేరే బ్యానర్ లో సినిమా చేయించుకోవడం వల్లే తాము హర్టయినట్లు, విజయ్ ద్వారా తమకు ఆ విషయం తెలిసిందని, అందుకే కోపమొచ్చినట్లు బన్నీ వాసు తెలిపాడు. ఆ తర్వాత పరశురామ్ కూడా ఈ విషయంలో తమకు కాల్ చేసి క్లారిటీ ఇచ్చాడని, భవిష్యత్తులో విజయ్- పరశురామ్ కాంబోలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తామని బన్నీ వాసు వెల్లడించాడు.













