Buchibabu Sana: పెద్ది కోసం తిండీతిప్పలు మానేసి మరీ..!

సుకుమార్(sukumar) దగ్గర శిష్యరికం చేసి డైరెక్టర్ గా మారిన వారిలో బుచ్చిబాబు(buchibabu) కూడా ఒకరు. ఉప్పెన(Uppena) సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే మంచి డైరెక్టరుగా పేరు తెచ్చుకున్నాడు. ఉప్పెన సినిమా చూసి తర్వాత అతనికి ఎంతో మంది నిర్మాతలు తమ బ్యానర్ లో సినిమాలు చేయమని ఆఫర్లు ఇచ్చినప్పటికీ బుచ్చిబాబు తొందర పడలేదు.
రెండో సినిమా చేస్తే స్టార్ హీరోతోనే చేయాలనే ఆలోచనతో ఎన్ని ఆఫర్లు వచ్చినా వాటిని కాదనుకుని స్టార్ హీరో కోసం వెయిట్ చేశాడు. అందులో భాగంగానే మొదట ఎన్టీఆర్(NTR) తో బుచ్చి(Buchi) సినిమా చేస్తాడన్నారు కానీ కొన్ని రీజన్స్ వల్ల అది సెట్ అవలేదు. అయినా బుచ్చిబాబు పట్టువదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నాలు చేసి రామ్ చరణ్(ram charan) తో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుని పెద్దిని సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
అక్కడితో ఆగలేదు, పెద్దికు సంబంధించి బుచ్చిబాబు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి జాన్వీ(janhvi kapoor)ని తీసుకొచ్చాడు. ఆస్కార్ విన్నర్ రెహమాన్(rahman) ను మ్యూజిక్ కోసం రంగంలోకి దింపాడు. ఇవన్నీ చూసి అందరూ షాకవగా ఇప్పుడు బుచ్చిబాబు ఏకంగా తిండి, తిప్పలు మానేసి మరీ సినిమా కోసం కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు పెద్ది కోసం భోజనం మానేసి మరీ షూటింగ్, ఎడిటింగ్, మ్యూజిక్ పనుల్ని చూసుకుంటున్నాడని, ఇవన్నీ తెలుసుకున్న చరణ్, బుచ్చిబాబుకు ముందు హెల్త్ పై ఫోకస్ పెట్టి దానికి తగ్గ ప్రాధాన్యతనివ్వాలని సూచించారని తెలుస్తోంది. ఇదంతా చూసి ఈ సినిమా విషయంలో బుచ్చిబాబు ఎంత కసిగా ఉన్నాడో అర్థమవుతుంది.