సూర్య సినిమా ఆగిపోయిందా?
సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు, అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో మరో సినిమా రానుందని అనౌన్స్ చేసి కూడా 5 నెలలు దాటింది. పురాననూరు అనే టైటిల్ తో దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ, ఫహద్ ఫాసిల్, నజ్రియా లాంటి భారీ తారాగణంతో దీన్ని భారీ మల్టీ స్టారర్ గా ప్లాన్ చేసుకున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమా గురించి వార్తలైతే వస్తున్నాయి కానీ సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్ కు మాత్రం వెళ్లలేదు. సినిమా అనౌన్స్ అయి 5 నెలలైనప్పటికీ షూటింగ్ స్టార్ట్ అవకపోవడంతో సినిమా క్యాన్సిల్ అయిందని వార్తలొస్తున్నాయి. దీంతో సూర్య ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సూర్య, సుధా కొంగర మధ్య వచ్చిన విభేదాల కారణంగానే ఈ సినిమా క్యాన్సిలైందని టాక్. కానీ చిత్ర యూనిట్ మాత్రం వీటన్నింటినీ కొట్టి పారేస్తుంది.
షూటింగ్ లేటవుతున్న మాట నిజమే కానీ, సినిమా క్యాన్సిల్ కాలేదని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని సోషల్ మీడియా సాక్షిగా చిత్ర బృందం వెల్లడించింది. ప్రస్తుతం సుధా కొంగర ఆకాశం నీ హద్దురా సినిమాను హిందీలో రీమేక్ చేస్తుండగా, సూర్య పూర్తి ఫోకస్ కంగువా మీదే ఉంది. రెండు భాగాలుగా రానున్న కంగువా సినిమాపై సూర్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.













