రామ్ లుక్స్ పై ఆడియన్స్ అసంతృప్తి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ థండర్ ను రీసెంట్గా రామ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయగా, దానికి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. రామ్ ఫుల్ లెంగ్త్ మాస్ గెటప్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది.
ఇదంతా బానే ఉంది కానీ, ఆ వీడియోలో రామ్ లావెక్కాడనేది బాగా తెలుస్తోంది. బోయపాటి సినిమాల్లోలానే ఈ సినిమాలో కూడా జస్ట్ గ్లింప్స్ తో శాంపిల్ చూపించి ఊర మాస్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని చెప్పకనే చెప్పాడు బోయపాటి. కానీ రామ్ లుక్ పరంగా మాత్రం ఆడియన్స్ సంతృప్తికరంగా లేరు. ఉన్న దానికంటే రామ్ బరువు పెరగడం చూడ్డానికి కాస్త ఇబ్బందిగానే ఉంది.
తాము సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ కోసం స్టార్స్ తమని తాము ఛేంజ్ చేసుకుంటారు. రామ్ కూడా బోయపాటి మూవీ కోసం ఇలా కనిపించాడా అనేది ఒక మాట కాగా, ది వారియర్ లో బలంగానే కనిపించిన రామ్, ఇప్పుడు లావుగా ఎందుకు కనిపిస్తున్నాడనేది మరో మాట. మరికొందరు క్యారెక్టరైజేషన్ కోసమే రామ్ అలా మారాడని చెప్తున్నారు. మరి వీటిలో ఏది నిజమో దసరాకు సినిమా రిలీజైతేనే తెలిసేది.
అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడం, దానికి తోడు బోయపాటి చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.













