Boyapati Srinu: అఖండ2 కోసం బోయపాటి డెడికేషన్
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ టాలీవుడ్ లో చాలా స్పెషల్. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా(Simha), లెజెండ్(Legend), అఖండ(akhanda) సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్ కాగా, ప్రస్తుతం వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నారు. అదే అఖండ2(akhanda2). భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
అఖండ2 నెక్ట్స్ షెడ్యూల్ కోసం జార్జియాలో లొకేషన్స్ ను వెతకడానికి వెళ్లాడని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ ను చిత్ర యూనిట్ షూట్ చేయగా, జార్జియాలోని లొకేషన్లలో మరికొన్ని భారీ యాక్షన్ సీన్స్ తో పాటూ, ఇంకొన్ని సన్నివేశాలను కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అఖండ2 వర్క్స్ కోసం బోయపాటి తన బర్త్ డే కోసం కూడా బ్రేక్ తీసుకోలేదని చెప్తున్నారు.
ఈ క్రమంలోనే బోయపాటి తన బర్త్ డే ను కూడా అఖండ2 చిత్ర యూనిట్ తోనే జరుపుకుంటూ, సినిమాపై ఎంతో డెడికేషన్ తో వర్క్ చేస్తుండటం మేకర్స్ ను ఎంతో సంతోషపరుస్తుంది. అఖండ2తో ఆడియన్స్ కు నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించాలనే ఉద్దేశంతోనే బోయపాటి ఈ రెక్కీని నిర్వహిస్తున్నాడని, అతని డెడికేషన్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






